ఐదేళ్లలో బీజేపీ, అంతకు ముందు బీఆర్ఎస్ ఎంపీలు ఏమి చేశారు చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. గురువారం ఆయన మార్నింగ్ వాకర్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ వాకర్స్ని కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాముని ఫోటోతో కాకుండా మోదీ ఫోటో పెట్టి ఓట్లు అడగాలని బీజేపీకి సవాల్ విసిరారు.
ఎలాక్టోరల్ బాండ్ల విషయంలో మోడీ అవినీతిని ప్రోత్సహించే విధంగా మాట్లాడారని తెలిపారు. బాండ్ల రూపంలో లంచం ఇస్తేనే శరత్ చంద్ర రెడ్డికి బెయిల్ వచ్చిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో విచారణ సాగుతుందన్నారు. కేటీఆర్ ట్యాపింగ్ లో రోజుకో విధంగా మాట్లాదుతున్నారని మండిపడ్డారు. హరీష్ రావు ఏమి మాట్లాడుతున్నారో ఆయనకే తెలియడం లేదని అన్నారు. మేము రాముడుని ఆరాధిస్తాము.. రాజకీయాలు చేయమన్నారు. మోడీ ఫోటోతో ఓట్లు అడగండి రాముని ఫోటోతో కాదని అన్నారు.
తెలంగాణలో మెజారిటీ సీట్లోలో గెలుపు మాదే అని ధీమా వ్యక్తం చేశారు. నిన్న హనుమకొండ జిల్లా పెంచికల్ పేట గ్రామంలో జరిగిన శ్రీరామ నవమి వేడుకల్లో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బీజేపీ రూ.1000 కోట్ల నల్లధనాన్ని బాండ్ల రూపంలో సేకరించి రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. రూ.కోటి విరాళం ఇవ్వడంతో తనకు మద్యం కేసులో బెయిల్ వచ్చిందన్నారు. 500 కోట్ల బాండ్లు. ఎన్నికల బాండ్లకు సుప్రీంకోర్టు అన్యాయం చేసినా ప్రధాని వాటిని సమర్థించడం సరికాదన్నారు.