Monday, January 13, 2025

Welfare Schemes – తెలంగాణలో చరిత్రాత్మక పథకాలు అమలు చేస్తున్నాం – ఉప ముఖ్యమంత్రి భట్టి

ఇలాంటివి దేశంలో ఎక్కడా అమలు కావడం లేదు
డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌

ఖ‌మ్మం, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణలో త‌మ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాలు దేశంలో ఎక్క‌డా లేవ‌ని డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. సోమ‌వారం ఖ‌మ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క ప‌ర్య‌టించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు రుణం, ధాన్యం బోనస్ చారిత్రాత్మకమైన పథకాలు తెలంగాణ సర్కార్ ఇస్తుందన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలకు 45 వేల కోట్ల రూపాయాలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. రైతు భరోసాకు రూ.19 వేల కోట్ల రూపాయలు ఆత్మీయ భరోసాకు 2 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవ‌స‌రం ఉంద‌ని వివ‌రించారు.

- Advertisement -

ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన హామీ మేర‌కు…
ప్రజలకు ఇచ్చిన హామీల మేరకు అన్ని పథకాలను అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. ప్రతి స్కీంలో క‌న్ఫీజ్ లేద‌న్నారు. పథకాలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామ‌న్నారు. అలాగే, ఉపాధి హామీ పథకంలో సభ్యులకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు అర్హులు అని వెల్లడించారు. ఇందులో సెంట్ భూమి లేని వారికి వర్తిస్తుంది అన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన స్పష్టత ప్రభుత్వం దగ్గర ఉంది. అధికారులు ఇందిరమ్మ కమిటీలు సమన్వయంతో పని చేయాలి అని సూచించారు. గ్రామాల్లో ముడు చోట్ల ఫ్లెక్సీలని ఏర్పాటు చేయాలని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement