Monday, November 18, 2024

సంక్షేమ ప్రదాత కేసీఆర్.. పెద్ద‌ప‌ల్లిలో సీఎం జ‌న్మ‌దిన వేడుక‌లు ప్రారంభం..

ప్రపంచంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను తెలంగాణలో అమలుచేసి నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ ప్రదాత అని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పేర్కొన్నారు. కెసిఆర్ జన్మదిన వేడుకలు మూడు రోజులపాటు నిర్వహించాలని టీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపుమేరకు మంగళవారం పెద్ద‌ప‌ల్లి జిల్లా కేంద్రంలో కేసిఆర్ జన్మదిన వేడుకలను ప్రారంభించారు ఎమ్మెల్యే దాస‌రి మ‌నోహ‌ర్‌రెడ్డి.

పూర్తి మానసిక వికలాంగుల పాఠశాలలో అల్పాహారం పంపిణీ చేసి మొక్కలు నాటారు. అనంతరం మాట్లాడుతూ రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఎన్నో పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో పెద్దపెల్లి మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమత ప్రశాంత్ రెడ్డి తో పాటు తెరాస ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement