Friday, January 10, 2025

MBNR | సంక్షేమం ఆగదు.. విపక్షాలకు డిప్యూటీ సీఎం భట్టి చురకలు

  • 33/11కేవి విద్యుత్ ఉప కేంద్రాలను ప్రారంభించిన
  • ఉప ముఖ్యమంత్రి.మల్లు భట్టి విక్రమార్క


వనపర్తి ప్రతినిధి, జనవరి 9(ఆంధ్ర ప్రభ) : ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు పన్నినా సంక్షేమ పథకాల అమలు మాత్రం ఆగదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వనపర్తి నియోజకవర్గంలో విద్యుత్ ఉప కేంద్రాల శంకుస్థాపన, ప్రారంభోత్సవానికి రేవల్లి మండలం తల్పునూర్ గ్రామానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి స్వాగతం పలికారు.

అనంతరం పోలీసులచే గౌరవ వందనం స్వీకరించారు. అలాగే గోపాల్ పేట మండలం ఏదుట్ల గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన 33/11కేవి విద్యుత్ ఉప కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ అమలుచేసి తీరుతామన్నారు. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులున్నా పాత పథకాలకు కోత విధించడం లేదన్నారు.

రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను జమ చేస్తామని, ఎన్నికల్లో హామీ ఇచ్చిన గ్యారంటీలను ప్రజా ప్రభుత్వం అమలు చేయదంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, వాటిని ఎవరూ నమ్మవద్దన్నారు. ప్రభుత్వ పథకాలను కార్యకర్తలు క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలి అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి వెంట నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి, రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షులు డాక్టర్ చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డిలున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement