Tuesday, November 19, 2024

NLG : దివ్యాంగుల సంక్షేమానికి పెద్దపీట

పెన్ పహాడ్, నవంబర్19(ప్రభ న్యూస్): దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసిందని వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షులు నయీమ్, రాష్ట్ర నాయకులు మల్లారెడ్డి అన్నారు. ఆదివారం మండల పరిధిలోని సింగారెడ్డి పాలెం, మాచారం, పొట్లపాడు, పెన్ పహాడ్ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలో వికలాంగుల సంఘం మండల అధ్యక్షుడు పేర్ల సోమయ్య అధ్యక్షతన ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాల అభివృద్ధి ప్రదాత మంత్రి సూర్యాపేట నియోజకవర్గ బీఆర్ఎస్‌ అభ్యర్థి గుంటకండ్ల జగదీష్ రెడ్డి గెలుపే లక్ష్యంగా గ్రామంలో వికలాంగుల ఇళ్ల కు డోర్ టూ డోర్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.

వికలాంగులకు సబ్సిడీ రుణాలు ట్రై సైకిల్లు, వీల్ చైర్లు, ఉచిత కంప్యూటర్లు, ఐదు శాతం రిజర్వేషన్ కల్పించింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన అన్నారు. వికలాంగులకు వికలాంగుల పెన్షన్ 4000 నుండి 5000 వరకు దశల వారీగా పెంచి వారి అభివృద్ధికి కృషి చేసింది అన్నారు. రాబోయేఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సమితి డైరెక్టర్ తూముల ఇంద్రసేనారావు, మండల కో ఆప్షన్ సభ్యులు షేక్ రఫీ, మాజీ సర్పంచ్ ఊరుకొండ రాధాకృష్ణ, గ్రామ శాఖ అధ్యక్షులు ఒగ్గు గోపి, డైరెక్టర్ గూడపురి రవి, మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షేక్ మస్తాన్, నాయకులు బంటు నారాయణ బోల్లెద్దు వినోద్, ఎస్ ఉప్పలయ్య, సుభాన్, హనుమంతు, రవి, రంగయ్య, పోశాలుహుసేన్. రవి. హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement