భారతీయుడు -2 సినిమా యూనిట్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పంధించారు. వివరాల్లోకి వెళ్తే.. డ్రగ్స్ నియంత్రణపై ప్రముఖ హీరో కమల్ హాసన్, దర్శకుడు శంకర్, సిద్దార్థ, సముద్రఖని కలిసి అవగాహన వీడియో చేశారు.
దీనిపై స్పంధించిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిరే ట్విట్టర్ వేదికగా భారతీయుడు -2 సినిమా బృందానికి ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు.
‘డ్రగ్స్ రహిత సమాజం కోసం ప్రజా ప్రభుత్వం చేస్తోన్న ప్రయత్నానికి మద్ధతుగా కమల్ హాసన, శంకర, సిద్దార్థ, సముద్రఖని లిసి ఈ అవగాహనా వీడియో రూపొందించడం హర్షించదగ్గ విషయం.’ అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం డ్రగ్స్ మహంమారి మత్తులో ప్రజలను ముఖ్యంగా యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రేవంత్ .
దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సైబర్ నేరాలు అని తెలిపారు. కాగా ఈ డ్రగ్స్ వినియోగాన్ని నియంత్రిచడంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోందని, సీనిమా రంగం సైతం డ్రగ్స్ మహంమ్మారిని మట్టుపెట్టేలా చలనచిత్ర నటీనటులు , నిర్మాతలు, దర్శకులు 1, 2 నిమిషాల అవగాహన వీడియో చేసి, ప్రభుత్వానికి పంపాలని కోరారు. వాటిని ధియేటర్లలో ప్రదర్శిస్తామని రేవంత్ చెప్పారు.