Friday, November 22, 2024

TS: బీసీ కుల గణనపై అసెంబ్లీలో బిల్లుకు క‌విత డిమాండ్

హైద‌రాబాద్ – కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బీసీ కుల గణన తీర్మానం పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. కాగా, బీసీ జనగణన కోసం ప్రభుత్వం తీర్మానం పెట్టడాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. ఎప్పుడు కుల జన గణన చేస్తారు.. ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పలేదు అని ఆమె ప్రశ్నించారు. కానీ కంటి తుడుపు చర్య లాగా తీర్మానం చేసి వదిలి వేసింది ఈ ప్రభుత్వం అన్నారు. దీనిని భారత జాగృతి తీవ్రంగా ఖండిస్తుంద‌ని.. తీర్మానంలోనే క్లారిటీ లేదు, బీసీ సబ్ ప్లాన్ కు చట్ట బద్ధత చేయాలి అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. శనివారం ఉదయం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ, బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కులగణనకు చట్టబద్ధత కల్పించాలని, తక్షణమే ఆ చట్టాన్ని అసెంబ్లీలో ఆమోదించాలని ఆమె డిమాండ్‌ చేశారు.

అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. బీసీలు ఇప్పుడే గుర్తు వచ్చారా అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నార‌ని అయితే తాము కూడా రాహుల్ గాంధీని ప్రశ్నిస్తున్నామ‌న్నారు. . మీకు ఇన్ని రోజులు బీసీలు ఎందుకు గుర్తు రాలేద‌ని నిల‌దీశారు.. గతంలో మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు అని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీది బీసీ వ్యతిరేక చరిత్ర అని ఆరోపించారు. మండల్ కమిషన్ సమయంలో పార్లమెంటులో రాజీవ్ గాంధీ బీసీలకు వ్యతిరేకంగా మాట్లాడారని గుర్తుచేశారు. 2011లో యూపీఏ హయాంలో చేసిన కులగణన నివేదికను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు.

తండ్రికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు….

తన తండ్రి జ‌న్మ‌దినం సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. స్వయం పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చాటి, అరవై ఏళ్ల స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసి, తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ కేసీఆర్ గారికి ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకొచ్చింది. ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే మహనీయుడన్నారు. కారణ జన్ముడైన కేసీఆర్ చిరస్మరణీయుడిగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు.

- Advertisement -

అలాగే, తన తండ్రికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు. స్వయం పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అని చాటి, అరవై ఏళ్ల స్వరాష్ట్ర ఆకాంక్షను సాకారం చేసి, తెలంగాణను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ కేసీఆర్ గారికి ట్విట్టర్ ( ఎక్స్ ) వేదికగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకొచ్చింది. ప్రజల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే మహనీయుడన్నారు. కారణ జన్ముడైన కేసీఆర్ చిరస్మరణీయుడిగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement