Saturday, November 23, 2024

Weekly Off – సెలూన్ సిబ్బందికి వీక్లీ ఆఫ్ – ప్రకటించిన సిపి రంగ‌నాథ్

వరంగల్ క్రైమ్ ఆగస్టు 11(ప్రభ న్యూస్) నిబద్ధతతో పని చేసే సిబ్బంది సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగ నాథ్ పునరుద్ఘాటించారు. పోలీస్ కమీషనరేట్ సెలూన్ విభాగంలో పనిచేసే సిబ్బందికి వీక్లీ ఆఫ్ ను ప్రకటించారు. సిబ్బంది సంక్షేమం మరువబోనని స్పష్టం చేశారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో బార్బర్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి వరంగల్ లో వారంతపు సెలవు మంజూరు చేసారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో నిర్వహించే పోలీస్ సెలూన్ విభాగంలో నిరంతరం విధులు నిర్వహించే సిబ్బంది తమ వ్యక్తిగత పనులు నిర్వర్తించుకోవడంతో పాటు,వారి కుటుంబ సభ్యులతో కొద్ది సమయాన్ని కేటాయించేందుకు గాను వెసులుబాటు కల్పించే నిర్ణయాన్ని ప్రకటించారు. పోలీస్ సెలూన్లో విధులు నిర్వహించే సిబ్బందికి ప్రతి మంగళవారం రోజున వారంతపు సెలవుగా పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ ప్రకటించారు.

తమ సంక్షేమాన్ని దృష్టిలో వుంచుకొని గతంలో ఎన్నడు లేని విధంగా తమకు వారంతపు సెలవు మంజూరు చేసినందుకు గాను పోలీస్ సెలూన్ సిబ్బంది వరంగల్ పోలీస్ కమిషనరు ను మర్యాద పూర్వకంగా కలుసుకోని పుష్పాగుచ్చాలను అందజేసి కృతజ్ఞతలు తెలియజేశారు. సెలూన్ నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఉన్న అధికారుల దృష్టికి తీసుకరావాలని పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ సెలూన్ సిబ్బందికి సూచించారు. పోలీస్ కమిషనర్ ను కలిసిన వారిలో జె. శ్రీరాములు, కుమారస్వామి, వెంకటేశ్వర్లు, మోహన్, సమ్మయ్య, యుగేందర్ తదితరులు పాల్గోన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement