వరంగల్, ప్రభన్యూస్ ప్రతినిధి: రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో యాజ మాన్య కోటా పీజీ వైద్య, దంత విద్య సీట్లకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ మేరకు హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం మాఫ్ ఆఫ్ విడత ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది. తుది మెరిట్ జాబితాలోని అర్హులైన అభ్యర్దులు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఇప్పటికే మొదటి, రెండవ విడతలలో ప్రవేశాలు పొందిన అభ్యర్ధులు ఈ విడత కౌన్సెలింగ్‌కు అనర్హులు సీట్లు ఖాళీల వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు.
ఈనెల 25, 26వ తేదిల్లో ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్‌ఆప్షన్లు న మోదు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్‌సైట్ www.knruhs.telangana.gov.in లో చూడాలని యూనివ ర్సిటీ వర్గాలు ప్రకటనలో తెలిపారు.