Tuesday, September 17, 2024

Weather Report – మరో నాలుగు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు

హైదారాబాద్ – తెలంగాణలోనూ వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదివారం తేలికపాటినుంచి మోస్తరు వర్షం చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, కొమురం భీం ఆసిఫాబాద్, , భద్రాద్రి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, గంటకు 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

సోమవారం కూడా పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు ఐఎండీ తెలిపింది. మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వివరించింది. బుధవారం వరకు వానలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ తెలిపింది

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement