Thursday, October 17, 2024

Weather Report – మరో ఐదు రోజులూ వానలే

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – తెలంగాణ లోని ఐదు జిల్లాల్లో సోమవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. నిజామాబాద్‌, కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.ఇక తెలంగాణలో వచ్చే ఐదురోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపపథ్యంలో పలు జిల్లాలకు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఆరెంజ్‌ అలర్ట్‌ ప్రకటించింది. సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో కోస్తాంధ్ర ప్రదేశ్‌లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో శనివారం ఏర్పడిన ఆవర్తనం పశ్చిమబెంగాల్‌ మీదుగా ఏర్పడిన ఆవర్తనంలో కలిసిపోయిందని పేర్కొన్నది. నేటి నుంచి ఐదు రోజుల పాటు ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురియవచ్చని పేర్కొన్నది.

మంచిర్యాల జిల్లా నీల్వాయిలో 15.83 సెంటీమీటర్ల వర్షపాతం

- Advertisement -

ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురిసింది. మంచిర్యాల జిల్లా నీల్వాయిలో అత్యధికంగా 15.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. భూపాలపల్లి జిల్లా కాటారంలో 11.15, ఆదిలాబాద్‌లోని కుంచవెల్లిలో 11.08, భూపాలపల్లిలోని మహదేవ్‌పూర్‌లో 11, కొయ్యూరులో 10.65, మంచిర్యాలలోని కోటపల్లిలో 9.48, హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో 9.48, వికారాబాద్‌లోని నవాబ్‌పేటలో 8.48, రాజధానిలోని షేక్‌పేటలో 8.45, మారేడ్‌పల్లిలో 8.4, ఖైరతాబాద్‌లో 8.4, ముషీరాబాద్‌లో 8.2, శేరిలింగంపల్లిలో 7.93 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement