Friday, October 18, 2024

Weather Report : తెలంగాణలో నేడు తేలికపాటి వానలు

హైదరాబాద్ : తెలంగాణలోని పలు జిల్లాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని తెలిపారు.

హైదరాబాద్ నగరమంతటా పొడి వాతావరణం ఉంటుందని.. కొన్నిచోట్ల ఎండలు ఉన్నప్పటికీ సాయంత్రం పలుచోట్ల వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.

- Advertisement -

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ఈరోజు అక్కడక్కడా వర్షాలు కురుస్తాయి. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.

ఇతర జిల్లాల్లో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉంది. ఈ మేరకు నగర ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేశారు. వర్షం సమయంలో బయటకు రావద్దని సూచించారు.

నిన్న రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు కురిశాయి. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో 7.9 సెంటీమీటర్ల వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆ తర్వాత కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేటలో 5.6 సెం.మీ. వర్షం కురిసింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో 5.6 సెం.మీ, కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలో 5.3 సెం.మీ. వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement