Friday, October 18, 2024

Weather Report – ఆ ప‌ది జిల్లాల‌లో కుంభ వృష్టే… అరెంజ్ అలెర్ట్ ప్ర‌క‌ట‌న

ఆంధ్ర‌ప‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ – తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని పది జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. భద్రాది కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, ములుగు, వరంగల్ జిల్లాలకు ఆరెంజ్ ఐఎండీ అలెర్ట్ జారీ చేసింది.

అంతేకాకుండా.. ఈదురుగాలులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ఆ పది జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. మరోవైపు.. హైదరాబాద్తో పాటు పరిసర జిల్లాల్లో సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

- Advertisement -

తీరం దాట‌నున్న తుపాను ..
కాగా.. ఈరోజు సాయంత్రం లోపు అల్పపీడనం తీరం దాటనున్నది. ఈ క్రమంలో.. రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ముఖ్యంగా వరంగల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు.. ఉత్తర తెలంగాణలో ఈ నెల 20 , 21వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ప్రభుత్వం అధికారులను అలర్ట్ చేసింది. ఆయా జిల్లాల కలెక్టర్లు అలర్ట్గా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement