Friday, November 22, 2024

TS | వణికిస్తున్న చలిపులి.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : రాష్ట్రాన్ని చలిపులి వణికిస్తున్నది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు అత్యంత కనిష్టానికి పడిపోతుండడంతో చలితీవ్రత తీవ్రంగా పెరుగుతోంది. తెల్లవారుజామున సూర్యోదయం అయినా కూడా చాలా సేపటి వరకు మంచుదుప్పటి వదలడంలేదు. మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, హైదరాబాద్‌, మెదక్‌ జిల్లాలకు అలర్ట్‌ జారీచేసింది. మరీ ముఖ్యంగా తెలంగాణ కశ్మీర్‌గా పిలుచుకుని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి.

దీంతో ఏజెన్సీ ప్రాంతాలు చలికి గజగజ వణికిపోతున్నాయి. ఉదయం 8 దాటినా జనాలు ఇండ్లలోకి రావలంటే భయపడుతున్నారు. పొగమంచు కురుస్తుండటంతో వాహణదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. కుమ్రంభీం జిల్లాలోని సిర్పూర్‌లో అతితక్కువగా 10.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఆదిలాబాద్‌ జిల్లా సోనాలలో 10.8 డిగ్రీలు, నిర్మల్‌ జిల్లా జామ్‌లో 12.6, మంచిర్యాల జిల్లా నెన్నెలలో 13.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పొగమంచు కారణంగా సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌-ముంబై జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న బస్సును మరో బస్సు ఢీకొట్టింది. దీంతో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement