Saturday, November 23, 2024

హైదరాబాద్ లో వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

నైరుతి రుతుపవనాలు తెలంగాణ చేరుకోనున్నాయి. రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. పలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. 

మరోవైపు హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఎల్బీ నగర్, నాగోల్, కవాడిగూడ, విద్యానగర్, జీడిమెట్ల, షాపూర్, సూరారం, హకీంపేట, రామంతపూర్, ఉప్పల్, చిక్కడపల్లి, చింతల్, రాంనగర్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, మేడిపల్లి, అంబర్ పేట, కాచిగూడ, నల్లకుంట, వనస్థలిపురం, హయత్ నగర్, రాజేంద్రనగర్, బండ్లగూడ జాగీర్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ వర్షం పడుతోంది. నిజామాబాద్, మెదక్, వరంగల్, ఖమ్మం తదితర జిల్లాల్లో వర్షం పడింది. రాగల రెండు,మూడు రోజుల్లో దక్షిణ తెలంగాణ జిల్లాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement