Friday, November 22, 2024

TS: ఆరు గ్యారెంటీల అమలుకు చిత్తశుద్ధితో పని చేస్తాం.. వెంకట్ రెడ్డి

చౌటుప్పల్, డిసెంబర్ 18 (ప్రభ న్యూస్) : ఆరు గ్యారెంటీల అమలుకు చిత్తశుద్ధితో పనిచేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రాష్ట్ర రోడ్డు భవనాలు, సినిమాటోగ్రఫి శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ మొదటిసారిగా జిల్లాకు వచ్చిన సందర్భంగా చౌటుప్పల్ మండలంలోని దండు మల్కాపురం శ్రీ ఆందోల్ మైసమ్మ దేవాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, జడ్పిటిసి సభ్యుడు చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, నారాయణపురం ఎంపీపీ గుత్త ఉమా ప్రేమ్ చందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు పబ్బు రాజు గౌడ్ తదితర నాయకులు శాలువాలు కప్పి, బొకేలు అందజేసి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆందోల్ మైసమ్మ దేవాలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి అర్చక స్వాముల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం చౌటుప్పల్ లో మంత్రి కోమటిరెడ్డిపై కాంగ్రెస్ శ్రేణులు పూలవర్షం కురిపించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను పెద్ద సంఖ్యలో భారీ మెజార్టీతో గెలిపించి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ రుణం తీర్చుకున్నారన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇచ్చిన 6 గ్యారంటీల అమలు కోసం చిత్తశుద్ధితో పనిచేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన అవినీతి, కుంభకోణాలపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అన్నివర్గాల ప్రజల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి కోసం అవసరమైన అన్ని రకాల చర్యలు తీసుకుంటామన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఖజానాను ఖాళీ చేయడం జరిగిందని, నిధుల సమీకరణగా కొంత సమయం పడుతుందని, రాష్ట్రంలో అమలు జరుగుతున్న అన్ని పథకాలను కొనసాగించడంతో పాటు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేయడం జరుగుతుందని మంత్రి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాలలో చౌటుప్పల్ మున్సిపాలిటీ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, జెడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, నారయణపురం ఎంపీపీ గుత్తా ఉమా ప్రేమ్ చంద్ర రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు పబ్బు రాజు గౌడ్, ఆకుల ఇంద్రసేనా రెడ్డి, బోయ దేవేందర్, సుర్వి నరసింహ, ఉబ్బు వెంకటయ్య, కాసర్ల శ్రీనివాస్ రెడ్డి, కొయ్యడ సైదులు, అంతటి బాలరాజు, సందగల్ల సతీష్ గౌడ్, కామిశెట్టి భాస్కర్, వైస్ ఎంపీపీ ఉప్పు బద్రయ్య, మొగుదాల రమేష్ గౌడ్, అర్ధ వెంకట్ రెడ్డి, సుర్కంటి వెంకట్ రెడ్డి, ఢిల్లీ చంద్రకళ, అబ్బాస్ బేగం, చెరుకు లింగస్వామితో పాటు వివిధ గ్రామాల గ్రామ శాఖల అధ్యక్షులు మున్సిపాలిటీలోని వార్డుల అధ్యక్షులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement