Friday, November 22, 2024

సర్కారు స్కూళ్లలో బుక్స్​ కొరత తీరుస్తాం.. వెల్లడించిన విద్యాశాఖ అధికారులు..

ప్రభన్యూస్‌, హైదరాబాద్‌ : హైదరాబాద్‌ జిల్లాలోని ఆయా ప్రభుత్వ స్కూళ్లలోని విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు పుస్తకాలను అందించేందుకు విద్యాశాఖ అధికారులు ముమ్మర చర్యలు తీసుకుంటున్నారు. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈనెల 13నుంచి పాఠశాలలు వేసవి సెలవుల తర్వాత ప్రారంభమైనా సంగతి తెలిసిందే. అయితే పుస్తకాల కొరతపై ఇటు విద్యార్థులు, అటు ఉపాధ్యాయ సంఘాల నుంచి తీవ్రమైన ఆందోళనలు వస్తుండటంతో ఎట్టకేలకు ప్రభుత్వం పుస్తకాల పంపిణీ ప్రక్రియను చేపట్టిందని తెలుస్తోంది. జిల్లాకు ఇప్పటి వరకు 27శాతం పుస్తకాలు వచ్చాయని అధికారిక సమాచారం. సుమారుగా 4లక్షల పుస్తకాలను సోమవారం నుంచి ఆయా ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులకు పంపిణీ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిణి (డీఈవో) ఆర్‌. రోహిణి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీచేశారు. అయితే మైనార్టీ స్కూళ్లలో దాదాపు 57వేల పుస్తకాలను ఈనెల 25న పంపిణీ చేసినట్లు డీఈవో ప్రభన్యూస్‌కు వెల్లడించారు. మిగతా పుస్తకాలను సైతం విద్యార్థులకు అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

మరోవైపు ప్రభుత్వం ఒకవైపు పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన ప్రజల పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తామని చెబుతూనే.. సర్కార్‌ బడుల పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోంది. పుస్తకాల ముద్రణ ఆలస్యం కావడంతో అధికారులు ఏమి చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రభుత్వం ఇప్పటికే బ్రిడ్జికోర్సు పేరుతో 2021-22 విద్యా సంవత్సరంలో విద్యార్థులు చదివిన తరగతులకు సంబంధించిన పాఠ్యపుస్తకాల్లోని పాఠాలనే మళ్లి బోధించాలని ప్రకటించిన సంగతి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement