Sunday, January 5, 2025

TG | ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరిస్తాం.. మంత్రి జూప‌ల్లి

మక్తల్, జనవరి 3 (ఆంధ్రప్రభ) : భీమా ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించిన సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్ల గుంపు గ్రామాల సమస్యలను పరిశీలించడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇవాళ నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని భూత్పూర్ రిజర్వాయర్ కిందకు ముంపునకు గురైన భూత్పూర్ గ్రామాన్ని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరితో కలిసి మంత్రి సందర్శించారు.

ఈసందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు ముంపు గ్రామాన్ని పరిశీలించి స్థానికులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వీలైనంత త్వరగా ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించి పునరావాసం ఏర్పాటు చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి ప్రకటించారు. మంత్రి వెంట‌ ఇరిగేషన్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement