దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు అంశాలపై చర్చించారు. ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ, పెండింగ్ డీఏలపై సీఎం చర్చించినట్లు తెలుస్తోంది.
ఉద్యోగుల పెండింగ్ సమస్యలను ఉద్యోగ సంఘాల నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా.. త్వరలోనే పరిష్కరిస్తామని రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సీఎంను కలిసే అవకాశం రాలేదని, అయితే రేవంత్‌రెడ్డి తమను సంప్రదించారని ఉద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.
2008 డీఎస్సీ బాధితులకు ఉద్యోగాలు ఇచ్చే అంశంపై ఈ నెల 12న కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామన్నారు. మరోసారి గవర్నర్ తో మాట్లాడిన ప్రొ. కోదండరామ్‌ను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తానని చెప్పారు. పాఠశాలలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని, పాఠశాలల్లో పారిశుద్ధ్య కార్మికులను నియమిస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు.