Friday, September 13, 2024

ADB: ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తాం… సీపీ శ్రీనివాస్

జన్నారం, సెప్టెంబర్ 5 (ప్రభ న్యూస్): ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తామని రామగుండం సీపీ ఎం.శ్రీనివాస్ తెలిపారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ఫారెస్ట్ గెస్ట్ హౌస్ లో తుడుందెబ్బ మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం సీపీని నేతలు కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దాడికి గురైన ఆదివాసి మహిళకు తప్పకుండా న్యాయం జరిగేలా చూస్తామన్నారు. మహిళపై దాడి చేసిన మగ్దూను అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరిగిందని అని చెప్పారు.

అన్నివర్గాల ప్రజలు సంయమనం పాటించాలని, రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేయకూడదని ఆయన చెప్పారు. ఇచ్చిన వినతి పత్రాన్ని తమ శాఖ ఉన్నతాధికారుల, జిల్లా పాలనాధికారి ద్వారా ప్రభుత్వానికి పంపించనున్నట్లు ఆయన తెలిపారు. నిందితునికి కఠిన శిక్ష పడేలాగా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆదివాసీ నేతలతో ఆయన మాట్లాడారు.

ఆయన వెంట మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, బెల్లంపల్లి ఏఆర్ డీఎస్పీ సురేందర్, స్పెషల్ పార్టీ ఆర్.ఐలు సంపత్ కుమార్, వామన్ కుమార్, స్థానిక ఎస్సై గుండేటి రాజ వర్ధన్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో తుడుందెబ్బ మండల అధ్యక్షుడు రాయిసీడం కాలి, ఉపాధ్యక్షుడు ఉర్వేత దర్ము, కోశాధికారి తొడసం గంగు పటేల్, జిల్లా, మండల నేతలు మెస్రం రాజ్ కుమార్, పెంద్రం రాజేష్, పి.సుధాకర్, వసంత్, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement