Thursday, November 21, 2024

Sridhar Babu : నాలుగు నెలల్లో ఏఐ సిటీ సిద్ధం చేస్తాం

నాలుగు నెల‌ల్లో ఏఐ సిటీ సిద్ధం చేస్తామ‌ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇవాళ‌ గ్లోబల్ లాజిక్ సాఫ్ట్ వేర్ ఆఫీసును ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు.. అనంతరం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ… రానున్న నాలుగు నెలల్లో పీపీపీ విధానంలో ఏఐ సిటీ నిర్మిస్తామని మంత్రి ప్రకటించారు.

తెలంగాణలో పెట్టుబడిదారులకు ప్రభుత్వం అన్నిరకాల సహాయ సహకారాలను అందిస్తుందని వెల్లడించారు. అన్నిరకాల పెట్టుబడులకు హైదరాబాద్ నగరం అనుకూలంగా ఉందని.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసి, యువతకు ఉపాధి కల్పిస్తున్నామని తెలియజేశారు. ప్రస్తుతం ఐటీ ఎగుమతులు 12శాతంగా ఉన్నాయని, వాటిని వచ్చే ఐదేళ్లలో 20శాతం చేర్చడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. మలేషియాలో స్థిరపడిన తెలుగు పారిశ్రామిక వేత్తలు హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నారని ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement