సిద్దిపేట – త్వరలోనే ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని హెచ్చరించారు మంత్రి హరీష్ రావు . అంతేకాకుండా కేంద్రంలో ఏ ప్రభుత్వం రావాలన్న సీఎం కేసీఆర్ మద్దతు తప్పనిసరి అని కీలక వ్యాఖ్యలు చేశారు .నేడు జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరయ్యారు. అందులో భాగంగానే.. ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పై విరుచుకుపడ్డారు.
రానున్న ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. అంతేకాకుండా సీఎం కేసీఆర్ మద్దతుతో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణను మరింత అభివృద్ధి చేసుకుందామని హరీష్ రావు తెలిపారు. ఇప్పటికే తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని తెలిపారు. కేంద్రం నుంచి ఎలాంటి నిధులు రాకుండా.. తెలంగాణ ప్రభుత్వం మీద కక్ష కట్టిందని ఆయన ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన లక్ష పదివేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఆపిందని విమర్శించారు. బోరుబావులకు మీటర్లు పెట్టలేదని మనకి హక్కుగా రావాల్సిన 21 వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపారు