త్వరలో కొత్త బస్సులను కొనుగోలు చేయబోతున్నామని ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఆర్టీసీకి 300 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి ప్రకటన చేశారు. తెలంగాణ ఆర్టీసీలో మరిన్ని సంస్కరణలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. సీఎం కేసీఆర్ సహాయంతో 2022 -23 ఆర్థిక సంవత్సరంలో అన్ని డిపోలను లాభాల బాటల్లోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు..ఈ ఏడాదిలో చేపట్టిన సంస్కరణలతో పాటు భవిష్యత్ లో అమలు చేయబోతున్న నిర్ణయాలు వెల్లడించారు . డిపోలను ఎత్తి వేసే ఆలోచన లేదని… ఆర్టీసీ లో కార్మికులను వేధింపులకు పాల్పడినట్లు దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు . ఆర్టీసీని ప్రైవేటీకరణ అసలు చేయబోమన్నారు.
ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయబోం-తెలంగాణ ఆర్టీసీకి 300ఎలక్ట్రిక్ బస్సులు-బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి
Advertisement
తాజా వార్తలు
Advertisement