Home తెలంగాణ‌ TG | త‌ల తాక‌ట్టు పెట్టి అయినా పేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇళ్లు ఇస్తాం – మంత్రి పొంగులేటి

TG | త‌ల తాక‌ట్టు పెట్టి అయినా పేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇళ్లు ఇస్తాం – మంత్రి పొంగులేటి

0
TG | త‌ల తాక‌ట్టు పెట్టి అయినా పేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇళ్లు ఇస్తాం – మంత్రి పొంగులేటి

హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఇచ్చిన హామీ మేరకు తల తాకట్టు పెట్టి అయినా అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. పేదవాడు అయితే చాలు.. పార్టీలకతీతంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని పేర్కొన్నారు.. హైదరాబాద్ కలెక్టరేట్ లో ఇవాళ‌ జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో అర్హులైన లబ్ధిదారులకు మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ పట్టాలు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ప్రతి పేదవాడికి సొంతిల్లు అనేది ఒక డ్రీమ్.. ఈరోజు ఇళ్లు పొందిన లబ్ధిదారుల ఆనందం చూస్తుంటే ఇంతకంటే మంచి కార్యక్రమం ఉండదనిపిస్తోందన్నారు. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నామని తెలిపారు.

ప్రతి గ్రామానికి అధికారులు వచ్చి అర్హుల వివరాలు సేకరిస్తారని.. ఎలాంటి పైరవీలు లేకుండా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఇంటి స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఇస్తామని తెలిపారు. లబ్దిదారుల వివరాల నమోదుకు యాప్ ప్రారంభించామ‌ని వెల్ల‌డించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామన్నారు.

Exit mobile version