Monday, January 13, 2025

TG | పేదోడి సొంతంటి క‌ల నెర‌వేరుస్తాం.. మంత్రి పొంగులేటి

మోడ‌ల్ ఇల్లు ప్రారంభం
ఖ‌మ్మం, ఆంద్ర‌ప్ర‌భ : పేదోడి సొంతంటి క‌ల నెర‌వేరుస్తామ‌ని రాష్ట్ర రెవెన్యూ, స‌మాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్‌రెడ్డి అన్నారు. సోమ‌వారం ఖ‌మ్మం జిల్లా పాలేరు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని కుసుమంచిలో నిర్మించిన మోడ‌ల్ ఇందిర‌మ్మ ఇల్లును ఆయ‌న ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ… ఎవరు ఎన్ని కుట్రలు చేసినా.. ఆటంకాలు సృష్టించినా, దుష్ప్రచారాలు చేసినా పేదోడి కలను నెరవేర్చి తీరుతామని స్ప‌ష్టం చేశారు.

రాజ‌కీయాల‌క‌తీతంగా 26 నుంచి ఇళ్ల కేటాయింపు…
మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేకుండా జనవరి 26 నుంచి ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తామని అన్నారు. ఉండడానికి ఇళ్లు లేని ప్రతి నిరుపేదకు ఇందిరమ్మ ఇళ్లు తప్పక అందుతుందని భరోసానిచ్చారు. రాబోయే నాలుగేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 20 లక్షలకు పైగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. రాష్ట్రంలో పంట సాగు చేస్తోన్న ప్రతి రైతుకు ఎకరాకు రూ.12 వేలు వారి ఖాతాల్లో జమ చేస్తామని అన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ కొత్త రేషన్ కార్టుల ను కూడా మంజూరు చేస్తామని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement