వేములవాడ, ప్రభన్యూస్ : మేములవాడ కలతో పాటు అందుబాటులో ఉన్న ఆలయాలతో కలిపి టూరిస్ట్ ప్యాకేజ్ ప్లాన్ చేస్తామని తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రకటించారు. గురువారం వేములవాడను సందర్శించిన ఆయన ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వేములవాడ ఒక గొప్ప పుణ్యక్షేత్రమని, రాజన్న దర్శనానికి దాదాపు 30 వేల మంది వస్తుండగా 9 వేల మంది ఆర్టీసీ ద్వారా వస్తున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నుండి ఆర్టీసీకి మంచి ఆదరణ ఉందిని, నూతన ప్రయాణికులు ఆకర్షించే విధంగా మరింత నూతన ఆలోచనలతో ముందుకు వెళ్తామన్నారు. సంస్థకు 116 నూతన బస్సులను కొనుగోలు చేస్తున్నారు. జిల్లా కేంద్రాల నుండి ఇతర రాష్ట్రాల్రకు ఎక్కువగా డిమాండ్ ఉన్న రూటులో వీటిని వినియోగిస్తామన్నారు. జిల్లాలో కూడా కొన్ని పైలట్ ప్రాజెక్టు కింద ఎలక్ట్రిక్రల్ వాహనాలు వినియోగిస్తామని, కరీంనగర్, నల్లగొండ , వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల హెడ్ క్వార్టర్ నుండి ప్రయోగాత్మకంగా ఈ వాహనాలను త్వరలో నడిపిస్తామన్నారు. దశాబ్దాల చరిత్రగల ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకువచ్చే విధంగా అధికారులతో కలిసి పూర్తి స్థాయిలో కృషి చేస్తానన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆర్టీసీ బస్సు తో ఒక అనుబంధం ఉందని, ప్రతి అవసరానికి ఆర్టీసీని వాడుకోవచ్చని, గ్రామీణ స్థాయిలో ప్రజల్లోకి వెళ్లి ఆర్టీసీ పట్ల అవగాహన కల్పిస్తామని..ప్రజలకు అనుగుణంగా ప్రయాణాన్ని కల్పించే విధంగా ముందుకు వెళ్తున్నామన్నారు.
డీజిల్ భారం కూడా ఎక్కువయిందని, దానిని తగ్గించే విధంగా ప్రయత్నాలు చేస్తున్నామని, అవసరమైన నిపుణుల సహాయం తీసుకొని భారాన్ని తగ్గించి కుంటామని వివరించారు. -72 శాతం ఆక్యుపెన్సీ పెరిగిందని, ఎక్కువ చేసిన కార్మికులకు ఇన్సెంటివ్ ఇస్తున్నామన్నారు. ఈ నెలలో ఆర్టీసీ యాప్ ను ప్రారంభిస్తామని, గ్రామీణ ప్రాంతంలోని ప్రయాణికుడు కూడా బస్సు ఎక్కడుందో తెలుసుకుని ప్రయాణ చేయవచ్చుని సజ్జనార్ తెలిపారు.రాజన్న ప్రసాదాన్ని కార్గో ద్వారా అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, ఏడాదిన్నరగా కార్గో ద్వారా విస్తృత సేవలు రాష్ట్రంలోని ప్రజలకు అందిస్తున్నామని, ఇప్పటికే 100 కోట్ల ఆదాయం కార్గో ద్వారా ఆర్టీసీ గడించిందని తెలిపారు. సమ్మక్క సారక్క జాతరలో బంగారం కోసం కార్గో కు ఆదరణ బాగా లభించిందని, భద్రాద్రి సీతారాముల కళ్యాణం సంబంధించి తలంబ్రాల కోసం లక్ష పైగా ఆర్డర్లు వచ్చాయని, జగిత్యాల నుండి ఇరవై రెండు టన్నుల మామిడి పండ్లను కార్గో ద్వారా ప్రజలకు అందించామని తెలిపారు. రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ , రాజన్న ఆలయ అధికారులతో చర్చించి రాజన్న ప్రసాదం కూడా కార్గో ద్వారా భక్తులకు అందించేందుకు పూర్తి ప్రణాళికతో ముందుకు వెళ్దామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి