Saturday, November 23, 2024

కేసీఆర్ బ‌ర్త్ డేకు నిర‌స‌న తెలుపుతాం: రేవంత్ రెడ్డి

కేసీఆర్ జన్మదినోత్సవం జరుపుకునే లోపు ఉద్యోగ నోటిఫికేషన్లు వెయ్యాలి.. లేకపోతే కేసీఆర్ బర్త్ డే రోజు నిరసన తెలువుతామని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. ఇవ్వాల ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు రేవంత్​. ఈసంద‌ర్భంగా కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి మాట్లాడుతూ… పార్టీ అంతర్గత విషయాలు డిస్కస్ చేశామ‌న్నారు. భవిష్యత్ లో ఏం చేయాలనే దానిపై చర్చించినట్టు తెలిపారు. తెలంగాణలో నిరుద్యోగుల ఆత్మహత్యలు రోజు వింటుంన్నాం.. ఇప్పుడు మిర్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వరి ధాన్యం కొనుగోలులో భారీ అవినీతి జరిగింది.. రైతులు తక్కువ ధరకు అమ్ముకుంటే.. మధ్యవర్తుల దగ్గర అధిక ధరకు ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఓక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని మండిపడ్డారు.

సిద్దిపేట, గజ్వేల్ లో ఉన్న వారే ప్రజలా.. త‌మ నియోజక వర్గంలో డబుల్ బెడ్ రూమ్ లు ఎందుకు ఇవ్వరు.. ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది.. అందరం కలిసికట్టుగా పనిచేయాలని తాను, రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నం.. అని కోమ‌టిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఐక్యంగా పోరాటాలు చేస్తుంది.. ఇంతవరకు ఒక్క డీఏస్సీ ఇవ్వలేదు.. కేసీఆర్ పుట్టినరోజు కానుకగా నిరుద్యోగ కాళీలను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.. తాము కంప్లైంట్ చేస్తే… ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయరు.. రాహుల్ గాంధీపై కేసీఆర్ సానుభూతి నాటకమేనా.. అని ప్రశ్నించారు. భువనగిరి అభివృద్ధికి నిధులు అడిగితే ఇవ్వలేదు. భువనగిరి సభలో తాను మాట్లాడుతా.. అంటే మైక్ ఇవ్వలేదు. రేపు రాచకొండ కమిషనరేట్ ముందు నిరసన వ్యక్తం చేస్తాం అన్నారు వెంకట్​రెడ్డి. చేవెళ్ల కు నీటి కోసం సబితా ఇంద్రారెడ్డి ఎందుకు పోరాడటం లేదు అని పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. అందరూ పదవుల కోసం పాకులాడుతే.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ ఉధ్యమం కోసం మంత్రి పదవిని త్యాగం చేసార‌న్నారు. తెలంగాణ ఉద్యమంలో కొండ లక్ష్మణ్ బాపూజీ లాంటి త్యాగం వెంకన్నది.. భవిష్యత్ కార్యచరణ పై ఇద్దరం చర్చించాం.. అని తెలిపారు. తాము చర్చించిన అంశాలను పార్టీలో చర్చకు పెట్టి నిర్ణయం తీసుకుంటామ‌న్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement