Friday, September 20, 2024

TG: మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తాం.. మీ తాట తీసుడే.. కౌశిక్ రెడ్డి

పిరాయింపు ఎమ్మెల్యేల‌కు కౌశిక్ వార్నింగ్
నాలుగేళ్లలో కొత్త సినిమా చూప‌డం గ్యారంటీ
హ‌త్యాయ‌త్నం చేసినా భ‌య‌ప‌డేది లేదు
ఉప ఎన్నిక‌ల్లో వారంద‌రినీ చిత్తుగా ఓడిస్తాం..

హైద‌రాబాద్ – ఐదేండ్ల త‌ర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావ‌డం ఖాయమ‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. ఇప్పుడు పార్టీ మారిన నేత‌ల సంగ‌తి అప్పుడు చూస్తామ‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల దాడి అనంత‌రం త‌న నివాసంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ… ఐదేండ్ల త‌ర్వాత కేసీఆర్ సీఎం కావ‌డం ఖాయమ‌ని, మీ భ‌ర‌తం ప‌ట్టడం ఖాయమ‌ని తేల్చేశారు… ఇది రాసిపెట్టుకోండి. ఇప్పుడు పార్టీ మారిన వారంద‌రికీ నాలుగేండ్ల త‌ర్వాత సినిమా చూపిస్తామ‌ని హెచ్చ‌రించారు.

హ‌త్యాయ‌త్నం చేసినా భ‌య‌ప‌డ‌ను..
కాంగ్రెస్‌ గూండాలు తనపై హత్యాయత్నం చేశారని కౌశిక్‌ రెడ్డి అన్నారు. తన ఇంటి కిటికీ అద్దాలు ధ్వంసం చేశారని చెప్పారు. ప్లాన్‌ ప్రకారమే గుడ్లు, టమాటాలు తీసుకొచ్చారని తెలిపారు. దాడులు చేస్తే భయపడేది లేదని స్పష్టం చేశారు. చంపే ప్రయత్నం చేస్తే.. మేమేందో కూడా చూపిస్తామన్నారు. గూండాలతో వచ్చి దాడి చేయడం ఎంతవరకు కరెక్టు అని ప్రశ్నించారు. హారతులతో స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉంటే.. తమపై రాళ్ల దాడులు చేస్తారా అన్నారు. రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యేకే రక్షణ లేదని, సామాన్య ప్రజలకు ప్రభుత్వం రక్షణ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. ప్రజా పాలన అంటే ఇదేనా రేవంత్‌ రెడ్డి అని నిలదీశారు. కాంగ్రెస్‌ గూండాల దాడికి రేపు ప్రతిచర్య ఉంటుందన్నారు.

పీఏసీ విప‌క్షానికి ఇవ్వ‌డం సంప్ర‌దాయం..
ప్ర‌తిప‌క్షానికి పీఏసీ ఇవ్వ‌డం ఆన‌వాయితీ అని, తాము అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌తిప‌క్షానికి ఇచ్చామ‌ని పేర్కొన్నారు కౌశిక్ రెడ్డి.. పీఏసీ కోసం హ‌రీశ్‌రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, గంగుల క‌మ‌లాక‌ర్ దాఖ‌లు చేసిన నామినేష‌న్లు ఏమ‌య్యాయ‌ని రేవంత్ ను నిల‌దీశారు… నామినేష‌న్ దాఖ‌లు చేయ‌ని అరికెపూడి గాంధీకి దొంగ‌చాటున పీఏసీ చైర్మ‌న్ గిరి ఎలా ఇస్తార‌ని ప్ర‌శ్నించారు.

- Advertisement -

అరికెపూడి గాంధీ మాట్లాడిన మాట‌ల‌ను ఆయ‌న విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నాన‌న్నారు.. గ‌తంలో మైనంప‌ల్లి హ‌న్మంత్ రావు అల్వాల్‌లో మీటింగ్ పెట్టి ఇదే విధంగా కేటీఆర్‌ను దూషించార‌ని, ఫ‌లితంగా ఆయ‌న 50వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయార‌ని గుర్తు చేశారు… రేపు నీ నియోజ‌క‌వ‌ర్గంలో నీకు కూడా అదే గ‌తి ప‌డుతుంద‌ని అరికెపూడిని హెచ్చ‌రించారు.. ఉప ఎన్నిక‌ల్లో కేసీఆర్ నాయ‌క‌త్వంలో మా ద‌మ్మేందో చూపిస్తామ‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement