బాన్సువాడ, ప్రభ న్యూస్.. రైతులు పండించిన ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ఢిల్లీ నుంచి వీడియో కాల్ ద్వారా బాన్సువాడ నియోజకవర్గ రైతులకు శాసనసభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు . తడిసిన ధాన్యాన్ని కొనుగోలు పై రైతులు ఇబ్బందులు గురి చేయకుండా వేగంగా కాంటాలు ఏర్పాటు చేసి మిల్లులకు తరలించాలని శాసనసభాపతి అధికారులను సిబ్బందిని ఆదేశించారు. దేశ రాజధాని ఢిల్లీలో నూతనంగా నిర్మించిన భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి వెళ్లిన శాసనసభాపతి నేరుగా బాన్సువాడ నియోజకవర్గం రైతులకు అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని ఆయన అన్నారు.
నియోజకవర్గంలో రైతులు ఎవరు భయపడవద్దని పోచారం శ్రీనివాస్ రెడ్డి రైతులకు వీడియో కాల్ ద్వారా తెలిపారు. ఏది ఏమైనా నియోజకవర్గం ప్రజలకు ఏ గ్రామానికి వెళ్లిన తన ప్రజలే దైవంగా భావించి శాసనసభాపతి పార్టీ పనుల నిమిత్తం ఢిల్లీ వెళ్లిన తన నియోజకవర్గం రైతులు కష్టాల గురికా వద్దని భావించి నేరుగా వీడియో కాల్ ద్వారా.. అధికారులకు కాంటలు ఏర్పాటు చేసి కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇస్తూనే,రైతులకు కూడా ప్రభుత్వం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని రైతులకు వివరించారు. భరోసా ఇచ్చారు. దీంతో బాన్సువాడ రైతాంగం ఇలాంటి నాయకుడు మాకు ఉంటే ఎలాంటి కష్టాలు ఉండవని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.