ఆర్చరీ క్రీడకు పున్‌ర్‌వైభవం తీసుకొస్తామని తెలంగాణ ఆర్చరీ సంఘం అధ్యక్షుడు కామినేని అనిల్ తెలిపారు. ఈక్రమంలో దశాబ్దానికిపైగా నిలిచిపోయిన జాతీయ ర్యాంకింగ్ ఆర్చరీ టోర్నమెంటు (ఎన్‌ఆర్‌ఏటీ)ను ఎన్టీపీసీ సహకారంతో తిరిగి ప్రారంభించామని తెలిపారు. 2వేల దశకంలో ఏటా ఈ టోర్నీ నిర్వహించడం ద్వారా క్రీడాకారుల్లో పోటీతత్వం పెరగడంతోపాటు మెరుగైన ప్రదర్శనతో రాణించిన ఆర్చర్లకు ఆర్థిక ప్రోత్సాహం అందించామని అనిల్ పేర్కొన్నారు. అప్పట్లో క్రమం తప్పకుండా ఈ టోర్నీ నిర్వహించడం వల్ల రాష్ట్ర, జాతీయస్థాయిలో అద్భుతమైన ప్లేయర్లు తయారయ్యారు అందుచేత ఈ టోర్నీని మళ్లిd నిర్వహించాలని నిర్ణయించాం. హైదరాబాద్ వేదికగా టోర్నీకి శ్రీకారం చుట్టాం. ఈసారి టోర్నీకి ఓవరాల్ ప్రైజ్‌మనీ రూ.90లక్షలు కేటాయించాం. గతంలో కేవలం సీనియర్ కేటగిరిలో మాత్రమే టోర్నీ నిర్వహించేవాళ్లం కానీ ఈసారి జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో ఆర్చరీ రేంజ్‌ను రూపొందించి పోటీలు జరుపుతున్నాం.. దీనివల్ల క్రీడాకారులుకు ఇంటర్నేషనల్ ఈవెంట్లలో పోటీపడిన అనుభవం వస్తుంది. తద్‌రా ఇంటర్నేషనల్ ఈవెంట్లలో తలపడినప్పుడు అక్కడ ర్చరీకి-పునర్‌వైభవం-తీసటెక్నాలజీ, సెటప్ చూసి ఒత్తిడికి గురవకుండా మెరుగైన ప్రదర్శన చేయడానికి మా ప్రయత్నాలు దోహదపడతాయని అనిల్ తెలిపారు. గచ్చిబౌలి స్టేడియంలో ఇండోర్ ఆర్చరీ అకాడమీ నెలకొల్పడానికి స్థలాన్ని కేటాయించాలని క్రీడామంత్రి శ్రీనివాస్‌గౌడ్, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డిని కోరాం ప్రభుత్వం సహకారం అందిస్తే అంతర్జాతీయ స్థాయిలో రెసిడెన్షియల్ అకాడమీని ఏర్పాటు చేసి హైదరాబాద్‌ను ఆర్చరీ హబ్‌గా తయారు చేస్తామని అనిల్ వివరించారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital