Sunday, November 24, 2024

TG: సాయంత్రంలోగా కొత్త చైర్మన్‌ను నియమిస్తాం.. సీఎం రేవంత్

సాయంత్రంలోగా విద్యుత్ కమిషన్‌కు కొత్త చైర్మన్‌ను నియమిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. విద్యుత్ అంశంలో న్యాయ విచారణ కోరిందే బీఆర్ఎస్ నేతలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సోమవారం విద్యుత్‌ చర్చలో భాగంగా సీఎం మాట్లాడారు.

విద్యుత్ కొనుగోళ్లలో అక్రమాలు జరగకపోతే విచారణ కమిషన్ ఎదుట బీఆర్ఎస్ నేతలు ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. 24గంటల విద్యుత్ చంద్రబాబు హయాంలోనే నిర్ణయం జరిగిందని గుర్తుచేశారు. యూపీఏ ప్రభుత్వ నిర్ణయాలతో హైదరాబాద్ ఆదాయం పెరిగిందని తెలిపారు. విద్యుత్ సంక్షోభం నుంచి బయటపడేలా చేసింది కాంగ్రెస్సే అని అన్నారు.

మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి చర్లపల్లి జైలులో ఉన్నట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోలు, యాదాద్రి పవర్ ప్లాంట్‌పై న్యాయ విచారణ జరుగుతోందని అన్నారు. కేసీఆర్ సత్యహరిశ్చంద్రుడు అనేలా జగదీశ్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. అంత నిజాయితీపరులైతే కమిషన్ ఎదుట ఎందుకు వివరాలు సమర్పించలేదని ప్రశ్నంచారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement