హైదరాబాద్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో మరో ప్రభుత్వ దంత వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావును తెలంగాణ డెంటల్ వైద్య విద్యార్థుల అసోసియేషన్ కోరింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న ఒక్క ప్రభుత్వ డెంటల్ కళాశాలతో ఎందరో విద్యార్థులకు సీట్లు రావడం లేదని పేర్కొంది. ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన ఉద్యోగ నోటిఫికేషన్లలోనూ డెంటల్ పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయని మంత్రి దృష్టికి తెచ్చింది.
అఫ్జల్‌గంజ్‌లోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో సమస్యలు తిష్టవేశాయని, పారిశుధ్యం లోపించిందని, హాస్టల్ నుంచి కాలేజీకి చేరేందుకు రవాణా సదుపాయం కల్పించాలని, సకాలంలో ఉపకారవేతనాలు చెల్లించాలని కోరింది. కళాశాలలో తాగునీటి వసతి కూడా కొరవడిందన్నారు.