Friday, November 22, 2024

గొంగళి పురుగులా ఉన్న ఖమ్మంను సీతాకోక చిలుకలా చేసుకున్నాం.. మంత్రి పువ్వాడ

నాడు గత పాలకుల హయాంలో గొంగళి పురుగులా ఉన్న ఖమ్మంను BRS ప్రభుత్వం వచ్చాక సీతాకోక చిలుకలా మర్చుకున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరాభివృద్ధిలో భాగంగా చేపట్టిన అనేక పనులు, ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు సైకిల్ పై ఖమ్మం కార్పోరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో పర్యటించారు..
వాడ వాడ పువ్వాడ కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
జిల్లా కలెక్టర్ VP గౌతమ్, మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ ఆధికారులతో కలిసి సైకిల్​పై పర్యటించారు. నగర వీధుల్లో తిరుగుతూ.. పారిశుధ్యం, విద్యుత్ స్తంభాలు, రోడ్డుకు అడ్డుగా ఉన్న హ్యాండ్ బోర్లు, డివైడర్లు, సెంట్రల్ డివైడర్లలో ఉన్న మొక్కలు, మురుగు కాల్వలు పరిశీలించి అక్కడ అక్కడ పేరుకుపోయిన చెత్తను తొలగించాలని ఆదేశించారు.

మున్సిపల్ కార్యాలయం నుండి బైపాస్ రోడ్డు మీదగా నూతన బస్ స్టాండ్ కు చేరుకుని టాయిలెట్స్ ను పరిశీలించారు.దుకాణదారులతో మాట్లాడి వస్తువుల ధరలు అడిగి తెలుసుకున్నారు. పలువురు ప్రయాణికులను కలిసి వారి ప్రయాణ వివరాలు, అక్కడ ఉన్న సేవలు, సౌకర్యంపై ఆరా తీశారు. 50వ డివిజన్ మామిళ్లగూడెం పెద్ద మార్కెట్ లోకి వెళ్ళి అక్కడ రైతులు, కూరగాయల వ్యాపారులతో మాట్లాడారు. ప్రతి రోజు అధిక మొత్తంలో కూరగాయల వ్యర్ధాలు ఆలస్యంగా తొలగిస్తున్నారని ఫిర్యాదు చేశారు. ఆయా చెత్త తొలగింపు పనులను తక్షణమే పరిశీలించి చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు. Pv నర్సింహ రావు పార్క్ ను పరిశీలించారు. టాయిలెట్స్, గ్రీనేరీ, ఓపెన్ జిమ్ లను పరిశీలించారు. పార్క్ లో కరాటే శిక్షణ పొందుతున్న చిన్నారులతో ముచ్చటించారు. బుర్హాన్ పురం, బస్ డిపో మయూరి సెంటర్, త్రీ టౌన్ జూబ్లీపుర ప్రాంతాల్లో పర్యటించారు. 46వ డివిజన్ లో మరమ్మత్తులు కొనసాగుతున్న మయూరి సెంటర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు. ఆయా పనుల వివరాలను R&B ఈఈ శ్యామ్ ప్రసాద్ ను అడిగి తెలుసుకున్నారు.

స్వర్ణభారతి కళ్యాణ మండపం, తహసిల్దార్ కార్యాలయం, ట్రంక్ రోడ్, కల్వొడ్డు, మోతి నగర్ లో మురుగు కాల్వను పరిశీలించారు. ఎప్పటికప్పుడు మురుగును తొలగించాలని సూచించారు. 35వ డివిజన్ బురద రాఘవాపురం ఎస్సీ కాలనీలో పర్యటించి స్థానిక గృహాల వారితో మాట్లాడారు. వారి సమస్యలను అడిగితెలుసుకున్నారు. మిషన్ భగీరథ పథకం ద్వారా ఏర్పాటు చేసిన త్రాగునీటి ప్రధాన పైప్ లైన్ ను మంత్రి పువ్వాడ ప్రారంభించారు. సైడ్ కాల్వలు లేకపోవడం వల్ల ఇబ్బందిగా ఉందని, రోడ్డు శిధిలావస్థలో ఉందని చెప్పగా తక్షణమే ఆయా పనులకు అంచనాలు వేయించి సైడ్ కాల్వలు, రోడ్డు ఏర్పాటు చేస్తామన్నారు. భక్తపోతన స్ట్రీట్, డాబాల బజార్, గుట్టల బజార్ లో పర్యటించారు. ప్రజలకు శుద్ది చేసిన త్రాగు నీటి అందించేందుకు, త్రాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం కోసం 32వ డివిజన్ గుట్టల బజార్ లో మిషన్ భగీరథ పథకం ద్వారా పబ్లిక్ హెల్త్ అధ్వర్యంలో నిర్మించిన 2300 KL సామర్ధ్యం కలిగిన ఓవర్ హెడ్ ట్యాంక్ ను పరిశీలించారు. గుట్టల బజార్, జహీర్ పుర, రాజేంద్ర నగర్, శ్రీనివాస్ నగర్ బ్రిడ్జి మీదగా చర్చ్ కాంపౌండ్, బోనకల్ క్రాస్ రోడ్, చెరువు బజార్, మాణిక్య నగర్, అబ్దుల్ కలాం నగర్ మీదగా మమత రోడ్ వరకు పర్యటించారు.ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని వారు నివేదించిన సమస్యలను, చేపట్టాల్సిన పనులు, గత పట్టణ ప్రగతిలో చేపట్టిన పనుల గూర్చి స్వయంగా తెలుసుకుని పరిష్కరించేందుకు సైకిల్ పై పర్యటిస్తున్నట్లు చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement