Friday, November 22, 2024

TG: రుణ మాఫీ చేశాం… ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి

ఇక సుల‌భ‌త‌రంగా రైతుల‌కు రుణాలు ఇవ్వండి
బ్యాంక‌ర్ల‌కు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి సూచ‌న‌
ఏక‌కాలంలో 31వేల కోట్లు రుణ‌మాఫీ చేయ‌డం కొత్త చ‌రిత్ర‌
బ్యాంక‌ర్లు కూడా రైతు సంబ‌రాలు నిర్వ‌హించాలి

ఆంధ్ర‌ప‌భ స్మార్ట్ – హైద‌రాబాద్ : ప్రభుత్వం జమ చేస్తున్న సొమ్మును కేవలం రైతులు పంట రుణమాఫీ కోసమే ఉపయోగించాలని రైతులను ఇబ్బంది పెట్టవద్దన్నారు ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌. పంట రుణాల మాఫీ నేపథ్యంలో గురువారం ప్రజా భవన్ లో ఇవాళ‌ జ‌రిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల ప్రత్యేక సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ… రుణమాఫీ స్కీమ్ అమలుపై బ్యాంకర్లకు పలు కీలక సూచనలు చేశారు.

రైతు రుణమాఫీ కింద వచ్చిన నిధులను బ్యాంకర్లు జమ చేసుకొని.. భవిష్యత్తు అవసరాల కోసం రైతులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలని కోరారు. లోన్లు ఇచ్చే విషయంలో ఎక్కడా అశ్రద్ధ చూపొద్దని సూచించారు. ఈ విషయంలో లీడ్ బ్యాంకు పెద్దన్న పాత్ర పోషించాలన్నారు. ఆగస్టు నెల దాటకముందే 31వేల కోట్లు రైతు రుణమాఫీ కింద విడుదల చేస్తామని, ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు 11 లక్షల పైబడి రైతులకు రూ.ఆరువేల కోట్ల పైబడి నిధులు విడుదల చేస్తున్నామని వివరించారు.

ఇదో కొత్త చ‌రిత్ర ..
భారతదేశ బ్యాంకింగ్ చరిత్రలోనే ఇంత పెద్ద మొత్తం ఒకేసారి రికవరీ కావడం ఓ చరిత్ర అని అన్నారు భ‌ట్టి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం బ్యాంకింగ్ వ్యవస్థకు పెద్ద ప్రోత్సాహం అన్నారు. రుణమాఫీ పథకం అమలులో బ్యాంకర్ల సహకారం అవ‌స‌ర‌మ‌న్నారు. రుణమాఫీతో రైతులు సంతోషంగా ఉన్నార‌న్నారు. రైతులు ఇంబ్బంది పడకుండా బ్యాంకర్లు చూడాలని, చిన్నపొరపాటు కూడా జరగకుండా చూసుకోవాలని సూచించారు.

- Advertisement -

ఇది పండగ రోజు ..
పండగలా రుణమాఫీ జరగాలని భ‌ట్టి పిలుపునిచ్చారు. ఈ రాష్ట్ర జీఎస్ జీడీపీలో 16.5% వ్యవసాయ రంగం నుంచి వస్తుందంటూ .. రాష్ట్రంలో 45% పైబడి ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నార‌న్నారు. రైతు రుణమాఫీ నేపథ్యంలో బ్యాంకుల వద్ద అధికారులు ఉత్సవాలు జరపాలని కోరారు. ప్రభుత్వం చేస్తున్న కృషిని రైతులకు వివరించాలన్నారు. రైతుల కోసం భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు, పథకాలు తీసుకురావాలని తమ ప్రభుత్వం భావిస్తున్నదని చెప్పారు. సాంప్రదాయ పంటలతో పాటు కమర్షియల్ క్రాప్స్ ను ప్రోత్సహించబోతున్నామన్నారు. బ్యాంకుల్లో రద్దీకి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement