నిర్మల్ ప్రతినిధి, అక్టోబర్ 31 (ప్రభ న్యూస్): అభివృద్ధి చేశాం.. ఆదరించండని రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ నియోజకవర్గం బీఆర్ఎస్ లో వలసల జోరు కొనసాగుతోంది. సీఎం కేసీఆర్ సారధ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే అభివృద్ది సాధ్యమని బీజేపీ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఈ క్రమంలో సోన్ మండలం కడ్తాల్ గ్రామానికి చెందిన యువసేన యూత్, రెబల్ స్టార్ యూత్, గరుడ యూత్, హల్ చల్ యూత్, శ్రీరామ్ యూత్, రెబల్ యూత్ తో పాటు కాంగ్రెస్, బీజేపీకి చెందిన మహిళలు 100మంది బీఆర్ఎస్ సీనియర్ నాయకులు సత్యనారాయణ గౌడ్ ఆద్వర్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు.
మామాడ మండలం పులిమగుడుగు గ్రామం, నిర్మల్ పట్టణంలోని మహాలక్ష్మి వాడకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తలు గులాబీ జెండాకు జై కొట్టారు. వీరందరికీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ…. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజల సమస్యల పరిష్కారమే ప్రధాన ఎజెండగా నిర్మల్ లో పని చేస్తున్నామని, అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల్లో ఎలాంటి కుట్రలు చేస్తున్నాయో ప్రజలు గమనించాలని సూచించారు.