కేటీఆర్ ట్వీట్టర్ ద్వారా ఇవాళ ఉదయం ఆసక్తిక ట్వీట్ చేశారు. సోషల్ మీడియా ముఖ్యంగా యూ ట్యూబ్‌లో ప్రత్యర్థుల ఫేక్ ప్రొపగాండాను తిప్పికొట్టడంలో తాము విఫలం అయినట్లు ట్వీట్లో ఒప్పుకున్నారు.
ఎన్నికల ఫలితాల తర్వాత ఎంతో ఆసక్తికర ఫీడ్‌బ్యాక్, ఎన్నో ఇంట్రస్టింగ్ కామెంట్స్ వస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ శ్వేతపత్రాలకు కౌంటర్‌గా ఇటీవల స్వేదపత్రం విడుదల చేసే సందర్భంగా కూడా బీఆర్ఎస్ ఓటమిపై కేటీఆర్ ఇదే రకమైన కామెంట్స్ చేశారు. కేసీఆర్ తన తొమ్మిదేళ్ల పాలనలో 32 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పెట్టే బదులు ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టేందుకు 32 యూ ట్యూబ్ చానళ్లు పెట్టి ఉండాల్సిందన్న అభిప్రాయం తనకు బాగా నచ్చిందని కేటీఆర్ తెలిపారు. ఈ అభిప్రాయంతో తాను కొంత వరకు ఏకీభవిస్తున్నానని కూడా ఆయన ట్వీట్లో చెప్పుకొచ్చారు.