హైదరాబాద్ : తెలంగాణ పట్ల వివక్షతతో ఒక్కపైసాగాన, ఒక్కప్రాజెక్ట్ గాని ఇవ్వని ప్రధాని మోడీ పార్టీ అయిన బిజెపి మనకెందుకు అంటూ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఘాటుగా విమర్శించారు.. ఈ మేరకు కెటిఆర్ తన ట్విట్టర్ లో వరుసగా ట్విట్లు చేశారు.. . విభజన హామీలు అమలు చేయని ప్రధాని నరేంద్ర మోడీపై కేటీఆర్ మండిపడ్డారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ , పసుపు బోర్డు , మెట్రో రెండో దశ లేదని ప్రధాని చెప్పారు. ఐటీఐఆర్ , గిరిజన యూనివర్సిటీ , బయ్యాం ఉక్కు ఫ్యాక్టరీ, రాష్ట్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వమని మోడీ చెప్పారు. తెలంగాణ కు ఏదీ ఇచ్చేది లేదని మోదీ సర్కార్ చెప్పిందని కేటీఆర్ వివరించారు. ప్రధాని ప్రాధాన్యతలో అసలు తెలంగాణే లేనప్పుడు.. తెలంగాణ ప్రజల ప్రాధాన్యతా క్రమంలో ప్రధాని ఎందుకు ఉండాలి..? అని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో ఆ దిక్కుమాలిన పార్టీ ఎందుకుండాలి.?? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. కేంద్రంలో ప్రభుత్వం నుంచి ఏమీ తీసుకురాని వెన్నుముఖ లేని బిజెపి ఎంపీలు మోడీ ప్రకటనలకు బాధ్యత వహించాలని అన్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement