చేవెళ్ల,జూలై 18 (ప్రభన్యూస్):’మున్సిపల్ మాకు వద్దు గ్రామ పంచాయితీ ముద్దు’ అంటూ నినాదాలు చేస్తూ రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లి గ్రామస్తులు మంగళవారం గ్రామం లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు. వా రు మాట్లాడుతూ నూతనంగా చేవెళ్ల మండలాన్ని మున్సిపా లిటీగా ఏర్పాటు చేస్తున్న క్రమంలో దేవుని ఎర్రవల్లి గ్రామం కూడా మున్సిపాలిటీలో కలుస్తుందని తెలిసి ‘మేము ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం చేపట్టాం అని, మా ఊరిని మున్సి పాలిటీలో చేరిస్తే ఊరుకునేది లేదు’ అని అన్నారు. సర్పంచ్, ఎంపీపీ ఎవరిని అడిగి వాళ్ళు మున్సిపలిటీలో చేర్చడానికి అంగీకరించారో అనే విషయం ప్రజల ముందుకి వచ్చి చెప్పాలని ఓట్లు మావి కావాలి కానీ ఇలాంటి సందర్భాల్లో ‘మా’ అభిప్రాయం తీసుకోరా’ అని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో, మాజీ ఎంపిటిసి చంద్రయ్య, మాజీ సర్పంచ్ అంజయ్య , చేవెళ్ల బీజేవైఎం మండల అధ్యక్షుడు పత్తి సత్యనారాయణ , శ్రీనివాస్, రాజు రవీందర్, శివయ్య, విట్టల్ రెడ్డి, కరికే శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు బేగరి అరుణ్ కుమార్,రమేష్, మల్లేష్ , గోపాల్, శ్రీశైలం గ్రామస్తులు, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement