Friday, November 22, 2024

ప్రతి గింజను కొనుగోలు చేస్తాం- ఎమ్మెల్యే దాసరి

పెద్దపల్లి మండలం బొంపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. అనంతరం మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచారని ..రైతులు నష్టపోయారని ప్రభుత్వం పై వేలాది కోట్ల రూపాయల భారం పడుతున్న ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందని ప్రతి అంశంలో రాష్ట్రాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుందని, రైతాంగం రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెబుతారన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో రైతాంగానికి పంట పెట్టుబడి కింద ఎకరానికి ప్రతి ఏడాది 10 వేల రూపాయలు పంట పెట్టుబడి కోసం అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి – శ్రీనివాస్, జడ్పీటీసీ బండారి రామ్మూర్తి,మండల పార్టీ అధ్యక్షుడు మార్కు లక్ష్మణ్, సహకార ఛైర్మెన్ దాసరి చంద్రారెడ్డి రెడ్డి,రైతు బంధు మండలాధ్యక్షుడు అనంత రెడ్డి, గ్రామ సర్పంచ్ లక్ష్మణ్,ఎంపీటీసీ శంకరయ్య,ఉప సర్పంచ్ లక్ష్మయ్య,మాజీ సర్పంచ్ కొమురేష్,గ్రామ శాఖ అధ్యక్షుడు భూమయ్య,గుర్రాల వీరేశం, అరికిల్ల అంజయ్య, సదయ్య,నర్సయ్య, శంకరయ్య,అబ్దుల్ల,సతీష్, రవి, నర్సయ్య, గట్టయ్య, రవి, రాయపోశం, సూర లక్ష్మయ్య,గ్రామ పాలక వర్గం, తెరాస నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement