Saturday, November 23, 2024

ప్రతి గింజా కొంటాం: మంత్రి గంగుల కమలాకర్‌..

ఉమ్మడి కరీంనగర్‌, ప్రభన్యూస్‌ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా 6540 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు- చేస్తు న్నట్లు- బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ పేర్కొన్నారు. కరీంనగర్‌ నియోజక వర్గంలోని దుర్శేడ్‌, నగునూరు, కొత్తపల్లి గ్రామాల్లో శుక్రవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. రైతు బిడ్డగా సీఎం కేసీఆర్‌ కు రైతుల సమస్యలు తెలుసునని స్వయం పాలనలో రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్నార‌ని అన్నారు. రైతులు ఏంతో కష్టించి పండించిన పంటను దళారులకు అమ్ముకుని వారి చేతుల్లో దోపిడీకి గురికాకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు- చేశామన్నారు. అన్నదాత పండించిన చివరి గింజను సైతం కొనుగోలు చేస్తామన్నారు.

రైతులు నిబంధనల మేరకు ధాన్యాన్ని తీసుకువచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. ఇప్పటికే వరి కోతలు మొదలు పెట్టిన అన్నదాతలు కోతలను శర వేగంగా పూర్తిచేస్తుంటే రైతుల కోతలకు అనుగుణంగా ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు తెరాస ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని అన్నారు. రైతు పండించిన ప్రతిధాన్యపు గింజను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌దు ఆదేశాలు జారి చేశారు..సీఎం కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకంతో తెలంగాణ పంట దిగుబడి పెరిగిందన్నారు. చిన్న రాష్ట్రమే అయినప్పటికీ, దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణ స్థాయికి చేరుకుందన్నారు.

కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసు కువచ్చే దిశగా సీఎం కేసీఆర్‌ చర్యలు తీసుకువచ్చారన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 6 వేల 540 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు- చేస్తున్నా మన్నా రు. ఇప్ప టివరకు 1762 కొనుగోలు కేంద్రాల ద్వారా 2 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రైతులు ఇష్టా రీతిన కాకుండా అధికారులు సూచించిన తేదీల్లో ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే ఇబ్బందులు లేకుండా ఉంటాయన్నారు. ధాన్యానికి సరిపడా గన్నీ బ్యా గులు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకున్నా మని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement