తెలంగాణ రైతాంగానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ గుడ్ న్యూ్స్ చెప్పారు. వరి ధాన్యానికి రూ.500ల బోనస్‌పై విధి విధానాలు రూపొందిస్తున్నామని తెలిపారు. శనివారం మంత్రి శ్రీధర్ బాబు మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ… ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేస్తామని స్పష్టం చేశారు. రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని పండించిన ప్రతీ గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. కావాలనే ప్రభుత్వంపై బీఆర్ఎస్, బీజేపీలు కుట్ర పూరితంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.
పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కుట్ర చేస్తున్నాయన్నారు. అసలు బీఆర్ఎస్, బీజేపీ మాకు పోటీయే కాదని అన్నారు. రాష్ట్రంలో 12 సీట్లలో తాము జెండా ఎగరేయబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ వేగవంతంగా జరుగుతోందని అన్నారు. ఇందులో ఎవరున్నా బయటకు వస్తారని చెప్పారు. తమ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడబోదని అన్నారు. అలాంటి సంస్కృతి తమకు లేదని వెల్లడించారు.