అర్హులందరికీ రెండు లక్షల రుణమాఫీ
త్వరలోనే పత్తిపాక రిజర్వాయర్
ధర్మారం, ఆంధ్రప్రభ : ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా తమ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలియజేశారు. శనివారం పెద్దపెల్లి జిల్లా ధర్మారంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ… 8నెలల కాలంలో హామీల అమలు కోసం ప్రయత్నిస్తున్నామని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అధికారంలోకి వచ్చిన వారం లోపే ప్రారంభించామన్నారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వాడకం దారులు అందరికీ జీరో బిల్లు అందిస్తున్నామన్నారు.
ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10లక్షలకు పెంచామన్నారు. గతంలో కాంగ్రెస్ హయాంలోనే విద్యుత్ ఉత్పాదన కేంద్రాలు ప్రారంభమయ్యాయని బీఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఒక్క ఉత్పాదన కేంద్రం కూడా ప్రారంభం కాలేదన్నారు. రామగుండంలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన కేంద్రం ప్రభుత్వ మంజూరు చేసింది అన్నారు. రామగుండం ధర్మపురి పెద్దపల్లి మంథని నియోజకవర్గాల్లోని టేలండ్ ప్రాంత రైతులకు లబ్ధి కురిచేందుకు పత్తిపాక రిజర్వాయర్ కు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగిందన్నారు.
త్వరలోనే సర్వేపల్లి పూర్తయి డీటెయిల్ ఎస్టిమేషన్ ప్రాజెక్టు రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. గత పదేళ్లుగా నిర్వాసితులకు పరిహారం అందించలేకపోయారని, ఈరోజు 18 కోట్ల రూపాయల పరిహారం అందించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి భట్టి, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు.