Thursday, September 19, 2024

TG: ఆపన్నుల సేవలో మేముసైతం.. వైద్య ఖర్చులకు మిత్రమండలి సాయం

మేముసైతం సేవలకు లబ్ధిదారుల ప్రశంసలు
ఆపన్నుల సేవలో మేముసైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ముందుకు సాగుతోంది. జన్మభూమి కోసం ఏదైనా చేయాలన్న తలంపుతో ఆంధ్రప్రభ దినపత్రిక ఎగ్జిక్యూటీవ్ ఎడిటర్, న్యూస్ నెట్ వర్క్ జనరల్ మేనేజర్ పసునూరి భాస్కర్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ ట్రస్ట్ మణుగూరు మండల పరిధిలో విశేష సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ, ప్రజల ప్రశంసలు అందుకుంటోంది. మేముసైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత సేవా కార్యక్రమాల్లో భాగంగా గురువారం జార్ఖండ్ నుండి మణుగూరుకు వలస వచ్చి, కూలి పని చేస్తూ జీవనం సాగిస్తున్న పింకీ అనే యువతి, రక్త కణాలు పడిపోయి, ప్రగతి హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది.

వైద్య ఖర్చుల కోసం ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మిత్రమండలి దృష్టికి తీసుకురాగా, బాధితురాలు పింకీకి వైద్య ఖర్చుల నిమిత్తం రూ.3000 లను మేముసైతం మిత్రమండలి ప్రతినిధులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మేముసైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ కోశాధికారి రంగ శ్రీనివాస్, ట్రస్ట్ సభ్యులు మిట్టపల్లి గోపి, పీ.జగన్మోహన్, చిందుకూరి రామారావు, మెడికల్ షాప్ సురేష్, డేరంగుల నరసింహ, గ్రామపెద్దలు, నామా భవాని తదితరులు పాల్గొన్నారు.

మరో నిరుపేదకు..
మేముసైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గురువారం షేక్ అహ్మద్ అనే వ్యక్తికి సాయం అందించడం జరిగింది. ఇతనికి మాటలు రావు, కళ్లు కూడా కనిపించవు. అతి నిరుపేద కుటుంబం కావడంతో మేముసైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో షేక్ అహ్మద్ వైద్య ఖర్చుల నిమిత్తం వారి కుటుంబానికి రూ.3000 అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేముసైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ కోశాధికారి రంగ శ్రీనివాస్, ట్రస్ట్ సభ్యులు. మిట్టపల్లి గోపి, పీ.జగన్మోహన్, చిందుకూరి రామారావు, మెడికల్ షాప్ సురేష్, డేరంగుల నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

నిరుపేద మృతురాలి దహనసంస్కారాలకు..
మేముసైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మణుగూరు మున్సిపాలిటీ పరిధిలోని రాజుపేట ప్రాంతానికి చెందిన అతి నిరుపేద కుటుంబంలోని శీలంశెట్టి లక్ష్మి(65) అనారోగ్యంతో మరణించగా, విషయం తెలుసుకున్న మేముసైతం మిత్రమండలి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శీలంశెట్టి లక్ష్మి కుటుంబ సభ్యులకు రూ.3000లను దహన సంస్కారాల నిమిత్తం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేముసైతం మిత్ర మండలి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పీ.జగన్మోహన్, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement