ప్రభ న్యూస్ : కొంతకాలంగా సూర్యాపేట జిల్లా మీదుగా ఇతర ప్రాంతాలకు వివిధ మార్గాల ద్వారా అక్రమంగా గంజాయి రవాణా జరుగేది. దీంతో సూర్యాపేట ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా నలుమూలల చెక్ పోస్టులు ఏర్పాటు- చేశారు. అక్కడ నిరంతరం గస్తీ ఏర్పాటు చేశారు. ఆ గస్తీల్లో బయటి వ్యక్తులు కనిపిస్తుండటం.. శాఖకు సంబంధం లేని మనుషులు ఫోజులిస్తుండటం విమర్శలకు దారితీస్తోంది. కొందరు యూనిఫమ్ తో మరి కొందరు యూనిఫాం లేకుండానే పోలీసులమని దబాయిస్తుండటం, వారు కూడా నిజమైన పోలీసులనే భావనను ప్రజలకు కల్పించే ప్రయత్నం జరుగుతున్నట్టు అర్థమవుతోంది. ఇంటి నుండి పొలానికి వెళుతున్న రైతులను పొల్యూషన్ సర్టిఫికేట్ కావాలని, మామూల, ఇతర వాహన దారులను అనేక ప్రశ్నలడుగుతూ అధికార దర్పం ప్రదర్శిస్తున్నారు. సూర్యాపేట దంతాలపల్లి రహదారిపై ప్రధాన పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటువంటివి జరుగుతున్నాయి.
ఆ రహదారిపై ఓ ఎస్‌ఐ విధులు నిర్వర్తిసుండగా … ఆయనతో పాటు మరో అపరిచిత వ్యక్తి కూడా ఆయనతో కలిసి విధులు నిర్వర్తించారు. ఈ సందర్భంగా రహదారిపై నుండి వచ్చి పోయే వాహనాలను, ప్రభుత్వ, ప్రైవేటు- ఉద్యోగులను పోలీసుల కంటే ముందు ఆ అపరిచితుడే తనిఖీలు చేపట్టారు. గ్రామం నుండి ఊరి చివర గల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లాలంటే టివిఎస్, స్కూటీకి సైతం పొల్యూషన్ సర్టిఫికెట్ ఉండాలని లేకుంటే ఉపేక్షించేదిలేదని ఇబ్బందులకు గురిచేశారు. తన టీవీఎస్ వాహనానికి కూడా పొల్యూషన్ సదరు వ్యక్తి అడిగాడని పేరు చెప్పడానికి ఓ రైతు వాపోయాడు. పోలీసుల కారణంగా తాము ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లాలంటే భయమేస్తోందని చెప్పాడు. యూనిఫామ్ లేకుండా సివిల్ డ్రెస్ ఉన్న వారు సైతం తాము కూడా పోలీసులమేనని తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని మరి కొందరు వాపోయారు.
వాస్తవానికి పోలీస్ శాఖకు సంబంధం లేని వ్యక్తులు … తనిఖీల సమయంలో ఉండకూడదు. ఇవి తెలిసిన శాఖ మరి ఎలా అనుమతించారో వారికేతెలియాలి… ఇటువంటి వాటితో ఫ్రెండ్లీ పోలీసింగ్ కాస్తా పొల్యూట్ అవుతోంది. ఇటువంటివి జరక్కుండా కట్టడి చేయాలని ఆ ప్రాంత ప్రజలు, రైతులు కోరుతున్నారు. కాగా ఈ విషయంపై తుంగతుర్తి డీఎస్పీ రవి స్పందిస్తూ ఓ ట్రైనీ ఎస్‌ఐ తనిఖీలు చేస్తుండగా.. అతని స్నేహితుడు కొద్ది సేపు అక్కడున్నట్టు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వసూళ్ల సమస్యే లేదని.. ఏదైనా ఫిర్యాదు అందితే విచారించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital