Tuesday, November 19, 2024

గిరిజన బాలికలు, మహిళల రక్షణ మనందరి బాధ్యత – డా.ఆనంద్

ఇటీవల గిరిజన బాలికలపై జరుగుతున్న అత్యాచార, హింసా సంఘటనలను తీవ్రంగా ఖండించి, వారి రక్షణకై ప్రభుత్వాలు, ప్రజలు నడుం బిగించాలని బంజారా మహిళా యన్ జీ వో చైర్మన్ డా.ఆనంద్, జీవన్ లాల్-ఇన్ కం ట్యాక్స్ అడిషనల్ కమీషనర్, తారాచంద్, అడ్వొకేట్ అమితా రాని, మాధవి, బాల నాయక్, అభినవ్ సర్దార్ పేర్కొన్నారు.

బాలికలు, మహిళల రక్షణ అనే అంశంతో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో రుక్మిణీ నాయక్, స్వామి నాయక్ మెమోరియల్ కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. పలువురు గిరిజన సంఘ నాయకులు, యన్ జీ వో ప్రతినిధులు పాల్గొని ప్ర‌సంగించారు. ఈ కార్యక్రమంలో ఇటీవల గిరిజన బాలికలు, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నిరోధించడానికి ఒక ప్రత్యేక కమిటీని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా గ్రామాలు, తండాల స్థాయిలో చైతన్య పరచాలని పలువురు వ్యాఖ్యానించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement