Tuesday, November 19, 2024

Wayanad విషాదాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలి: మంత్రి దుద్దిళ్ల

ఆంధ్ర ప్రభ స్మార్ట్ – హైదరాబాద్ – కేరళ వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడిన విషాదాన్ని జాతీయ విపత్తుగా గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు డిమాండ్ చేసారు. దీనిని కేవలం ఓ రాష్ట్ర సమస్యగా పరిగణించి వదిలేయాలని చూస్తే జాతి క్షమించదని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు .

 

దక్షిణాదిలో ఇటువంటి ఘటన గతంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. 350 మందికి పైగా దుర్మరణం పాలైన వయనాడ్ విలయాన్ని కేంద్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో కాకుండా మానవీయ దృక్పథంతో చూడాలని శ్రీధర్ బాబు సూచించారు.

- Advertisement -

 అతి భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్ తో కొండ చరియలు విరిగిపడటం, వర్షపు నీటితో బురద కలిసి ప్రవహించే సందర్భాల్లో ముందస్తు హెచ్చరికలకు సంబంధించి ఒక మాన్యువల్ రూపొందిచాలని ఆయన కోరారు. ఆధునిక శాస్త్ర విజ్ణానాన్ని వినియోగించి కొండ చరియలు విరిగిపడే ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలను మ్యాపింగ్ చేయాలని సూచించారు

వాతావరణ శాఖ ఇచ్చే ఆరెంజ్, రెడ్ అలెర్టులతో ప్రమాదాలను అంచనా వేయలేమని ఉపగ్రహాల చిత్రాల ద్వారా ఖచ్చితత్వంతో కూడిన హెచ్చరికలను జారీ చేసే వ్యవస్థను ఏర్పాటు చేయాలని శ్రీధర్ బాబు సూచించారు. భూకంప ప్రాంతాలను జోన్లుగా విభజించినట్టే కొండ చరియలు కుప్పకూలే అవకాశాలున్న ప్రదేశాలను కూడా కేటగిరీల వారిగా గుర్తించాలని ఆయన అన్నారు. రుతుపవనాల సమయంలో ఆ ప్రాంతాల్లో సహాయక బృందాలు నిరంతరం అందు బాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని కోరారు..

 .

 .

Advertisement

తాజా వార్తలు

Advertisement