Friday, November 22, 2024

మహిళా హక్కుల ఉద్యమ కెరటం సావిత్రిబాయి పూలే.. ఉప్పల శ్రీనివాస్ గుప్తా

మహిళా హక్కుల ఉద్యమ కెరటం సావిత్రిబాయి పూలే అని తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, ఐవీఎఫ్ తెలంగాణ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. గొప్ప సంఘసంస్కర్త మహిళలోకానికి చదువులు నేర్పించిన చదువుల తల్లి సావిత్రిబాయి పూలే 126వ వర్ధంతి సందర్భంగా.. సరూర్ నగర్ డివిజన్ లోని జింకలబావి కాలనీ.. గణేష్ మండపం చౌరస్తా వద్ద నిర్వహించిన వర్ధంతి కార్యక్రమంలో ఉప్పల శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథిగా హాజరై సావిత్రిబాయి పూలే విగ్రహనికి పూల మాల వేసి, ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ… సావిత్రిబాయి పూలే అట్టడుగు వర్గాలు, మహిళలకు చదువు సంపద వంటి సమస్త హక్కులు నిరాకరింపబడిన దేశంలో ఆనాటి సమాజపు కట్టుబాట్లను, సంప్రదాయాలను, ఆధిపత్యవర్గాలను ధిక్కరించి భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా పాఠశాలలు ప్రారంభించి 1848 మే 12న దేశంలో బహుజనులకు మెుట్టమెుదటి పాఠశాల ప్రారంభించారన్నారు. సమాజంలో ఎన్ని అవమానాలు ఎదురైనా మడమ తిప్పని ధీశాలి ఆమె అన్నారు. కేవలం 4 సంవత్సరాల్లోనే గ్రామీణ ప్రాంతాల్లో 20పాఠశాలలను ప్రారంభించి ఉచిత విద్యనందించారన్నారు. 1848లోనే దేశంలో విద్యా ఉద్యమం ప్రారంభించిన మెుదటి మహిళ ఉపాద్యాయురాలు, దళితుల, మహిళల విద్యా వ్యాప్తికి కృషి ప్రారంభించే నాటికి ఆమె వయస్సు 18 ఏళ్ళు మాత్రమేనన్నారు. వారి జీవితకాలంలో మొత్తం 52 పాఠశాలలు ప్రారంభించారన్నారు. అలాంటి సావిత్రిబాయి పూలే వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరూ వారి ఆశయసాధనకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తూ వారికి ఘనమైన నివాళులర్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో.. బేరా బాలకిషన్ జనరల్ సెక్రెటరీ మహేశ్వరం నియోజకవర్గం, వెంకట్ గౌడ్ అరవింద్ కుమార్, బేర బాలకిషన్, అరవింద్ శర్మ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement