Friday, November 22, 2024

Water Roads – అయ్యా ఆర్టీసి ఛైర్మన్.. ..బస్టాండ్ లోకి వెళ్ళేది..ఎలా.. ..

ఇందల్ వాయి జూలై 18 ప్రభ న్యూస్ – నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందల్ వాయి మండల కేంద్రములోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలోకి మనుషులు వెళ్లాలంటేనే జంకుకునే పరిస్థితి ఏర్పడింది.చిన్న పాటి వర్షం కురిసినా ఆర్టిసి బస్టాండ్ లోకి వెళ్లేందుకు వీలు లేదు.వర్షం నీరు పూర్తిగా ఎంట్రన్స్ లోకి చేరుకొని ఒక చెరువును తలపిస్తాయి.దీంతో ప్రజలు. ప్రయాణీకులు తీవ్ర ఈబ్బందులు ఎదుర్కొంటూ ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. నిత్యం వందలాది ఆర్టీసీ బస్సులు.నెలకు లక్షలాది రూపాయల దుకాణాల సముదాయాలకు అద్దెలు వస్తాయి.కానీ కనీస వసతులు లేక ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.దీనికి తోడు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రయాణీకులు బస్టాండ్ లోకి వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేయడంలేదు. .జిల్లాలోనే అన్నీ బస్టాండ్ లలో కంటే అత్యధిక ఆదాయం వచ్చే బస్టాండ్ ఎదైన ఉంది అంటే అది కేవలం ఇందల్ వాయి బస్టాండ్ మాత్రమే అనీ టక్కున చెప్పేస్తారు

అలాంటి బస్టాండ్ లోకి ప్రయాణీకులు వెళ్ళాలంటే మోకాలు లోతు నీటిని దాటి వెళ్ళాక తప్పదు..దీంతో మండల ప్రజలు తీవ్ర అవేదన వ్యక్తం చేస్తున్నారు.స్వయానా ఆర్టీసి ఛైర్మెన్ అయిన రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ సొంత నియోజకవర్గంలోనే పరిస్థితి ఇలా ఉంటే మరీ ఇతర జిల్లాల్లో ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాలు ఎలా ఉంటాయో నానీ పలువురు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా 44 వ జాతీయ రహదారి పై గల బస్టాండ్ ను ఆర్టీసీ అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని ప్రయాణీకులు.ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇందల్ వాయి బస్టాండ్ చుట్టూ వర్షం నీరు వెళ్లేందుకు డ్రైనేజ్ లేకపోవడం వల్లే ఈ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. తక్షణమే ఆర్టిసి అదికారులు బస్టాండ్ చుట్టూ డ్రైనేజ్ నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్టీసి ఛైర్మెన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రత్యేక చోరువ తీసుకుని నిధులు మంజూరు చేయాలని ప్రయాణీకులు.ఆర్టిసి బస్టాండ్ లో దుకాణాలు నడుపుతున్న చిరు వ్యాపారులు కోరుతున్నారు. ఆర్టీసి అధికారులు నిద్రమత్తును విడువాలని అప్పుడే ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణం సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు. ప్రయాణీకులు డిమాండ్ చేస్తున్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement