శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 4వేల క్యూసెక్కుల నీటిని మంగళవారం విడుదల చేశారు. బుధవారం సాయంత్రానికిది 6వేల క్యూసెక్కులకు చేరుకుంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. వరి నాట్లు వేసేందుకు నీళ్లను విడుదల చేయాలన్న ఆయకట్టు రైతుల కోర్కెను మంత్రులు కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్, నిజామాబాద్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాలకు చెందిన ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. దీనిపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు తగు ఆదేశాలిచ్చారు. మంగళవారం రాంసాగర్ ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువకు 4వేల క్యూసెక్కుల నీళ్లను వదిలారు. బుధవారం సాయంత్రానికిది 6వేల క్యూసెక్కులకు చేరుకోనుంది. దీని వల్ల నిజామాబాద్ జిల్లాలోని కొంత భాగం, కోరుట్ల,మెట్ పల్లి, జగిత్యాల, కరీంనగర్,పెద్దపల్లి, చొప్పదండి, ధర్మపురి,మంథని తదితర నియోజకవర్గాలలోని పంట పొలాలకు సమృద్ధిగా నీళ్లందుతాయి. ఈ ఆయకట్టు కింది రైతులు వరి నాట్ల పనులను మరింత ముమ్మరం చేస్తారు. సకాలంలో నీళ్లను విడుదల చేయడం పట్ల మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రైతాంగం ముఖ్యమంత్రి కెసిఆర్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
శ్రీరాంసాగర్ నుంచి 4వేల క్యూసెక్కుల నీళ్లు విడుదల
By mahesh kumar
- Tags
- important news
- Important News This Week
- Important News Today
- Latest Important News
- Most Important News
- Nizamabad Latest News
- Nizamabad Local News
- nizamabad news
- Nizamabad News Today
- Nizamabad News Today Live
- sri ram sagar project
- srsp
- SRSP reservoir
- Telanagana News
- Telangana Live News Today
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- Telugu Important News
- telugu latest news
- telugu news
- telugu news online
- Telugu News Updates
- Today News in Telugu
- Today Nizamabad News
- TS News Today Telugu
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement