Tuesday, November 26, 2024

Yadagirigutta | మాడ వీధుల్లో నీటితో శుద్ధి…

యాదగిరిగుట్టపైకి మాజీ మంత్రి హరీష్ రావ్, ఎమ్మెల్యేలు వచ్చి పాప పరిహార సంకల్పం చేయడంతో వారు చేసిన పూజల వల్ల ఆలయం అపవిత్రం అయిందని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య (గురువారం) కొండపైన మాడవీధులు పరిసర ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్ల నీటి తో శుద్ధి చేశారు. అనంతరం కొండకింద వైకుంఠ ధ్వారాం మెట్లమార్గం వద్ద మీడియా సమావేశం నిర్వహించారు.

ఎలక్షన్స్ లో మాట ఇచ్చిన ప్రకారం 2లక్షల ఋణమాపి చేసామన్నారు. ఇప్పటికి 34లక్షల మంది రైతులకు రుణమాఫీ డబ్బులు రైతుల బ్యాంక్ అకౌంట్లో జమచేయడం జరిగిందన్నారు. డ్రామారావు చేసే పనులు చెప్పే మాటలు అన్ని బూటకపు మాటలని, చేసే పనులు మొత్తం ధమాక్ లేని పనులు చేస్తాడని అన్నారు.

ప్రభుత్వం రాగానే చెప్పిన ప్రకారం 10నెలల్లోనే రైతులకు రుణమాఫీ చేసామన్నారు.రెండు రోజుల్లోనే మహిళలకు ఉచితబస్సు సౌకర్యం, అర్హులైన లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ ఏర్పాటు చేశామని తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం మూడు ఎకరాల భూమి ఏదని, దళితుడు సీఎం అయ్యాడా అని, ప్రశ్నించారు. హరీష్ రావు నువ్వు పెట్రోల్ పోసుకుని అగ్గిపెట్టే లేదని హేళనగా నిరసన చేసి చాలా మంది ఆత్మ బలిదానాలు కారణమైయ్యవని అన్నారు.

అందుకే నిన్ను రాష్ట్ర ప్రజలు డ్రామారావు అని పిలుస్తారని అన్నారు. కేసీఆర్ దళితున్ని సీఎం చేస్తా లేదంటే తల నరుక్కుంటా అన్నాడు,మరి దళితున్ని సీఎం చేశాడా, ఒక కత్తి ఇచ్చి తల నరుక్కోమంటే అయిపోయేది,ఆ తల భువనగిరి గుట్టకు వేలాడ దీస్తే ఇప్పుడు నువ్వు అడిగే ప్రశ్నకు అర్థం ఉండేదన్నారు.డ్రామారావు మీరు 10 సంవత్సరాలు పరిపాలించారు ఎన్నిహామీలు నెరవేర్చారన్నారు, మీరు చేసిన ప్రతీ అభివృద్ధి కార్యక్రమాలలో 50శాతం మీ అకౌంట్లో, మిగతా 50శాతం అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు.తెలంగాణ లో అన్ని నిధులు దోచుకున్నారని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆరోపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement